The progenitor of Tadikonda family(vamsam) is “Aghora Sivacharya”. He was Shatkala Siva Pooja Dhurandhara and Shadakshari mantra siddhi purusha. He weighed the scales of Pranava panchakshari in the presence of Srisaila Mallikarjuna Swami. Sri Ammaraja VijayaAditya Cholabhupalu the ruler of that time gave the village of Tadikonda as a grant to him, it is on the copper inscriptions (AD 950). With the wisdom of "Pashu - Pasha - Pathi" thathvatraya, he did severe penance in Srisailam for Lord Parameshwara who was pleased and blessed Aghora Sivacharya the knowledge of Shatlinga Sivarchana and made him authority in srisaila on it.

The family tree of Tadikonda was followed by Santha Mallaiah, Neelakanthudu, Veeramallaiah and Srigirilingama. Mallanna was born to Srigirilingam. He was blessed by Sri Sailapati who was a Shatkala Shiva Pujadurandara. He did Srimallikharjuna Lingapratishta on Pedaghattu in Tadikonda village. It was the year 1061 of the Salivahana era. He was doing sanchara with his disciples performing siva puja and take meals. Once they came to a village where there is no facility to perform Shiva Puja. There were no homes of Shiva worshipers or a Shiva temple or Vishnu temple. There was a abandoned temple of Gopalaswami, a mile away from the village - in the middle of the forest - the disciples cooked food there and ate after the pooja and slept in the precincts. They heard melodious flute in the middle of the night from inside the temple. Peeping inside they found Muralikrishna, they prayed him to come to Tadikonda. The lord said he would do it if Nitya Dhupadipanaivedyas are offered and came to tadikonda. Gopalakrishna doing mischievous things drinking milk eating butter while the housewife was doing household works.Gopalakrishna doing mischievous things, some movement of the wind caused them to panic, so they stopped and moved to the west side of the house. After some time SriSailapatigaru came to Tadikonda after completing his wanderings. After knowing the arrival and deeds of Gopalakrishna he informed the good news to the villagers and started building a temple. When the villagers by turns put the milk inside, Gopala appeared and turned orange. A old woman offered milk and doubts Swami was drinking milk or a cat. She peeped inside see. Krishnamurti, who was drinking, threw down the Paladutta and in Srisaila's dream said, "Nayana, this is the age of Kali. I will no longer accept offerings directly. I will appear on the rock. Devotees can worship me by building a temple." After the construction of the temple, Tirunallu(annual festivals) of Gopalaswamy is celebrated in Tadikonda on Vaisakh Poornima with colorful display till to-date.

After SriSailapati, Peddamallanaradhya, Chandrasekhara, Tripuranthaka and Pedabhairavamurti were successors. Bhairava Murthy with his thapodhana received a gift of an elephant and Agrahara with nagara from Poosapati Ananda Rao. Parvathalu, Kedaralinga and Veerabhadraya were born to Bhairavamurthy. In the matter of distribution of assets, Parvathalu shared Agrahara, Kedaralinga Karnikam, and Veerabhadraya Shisyasanchar. The village headship was inherited from Pedabhairavamurthy to Tadikonda vamsajulu. Parvathalu's sons are Bhairavamurthy and Peda Veeramallu. Bhairavamurthy got Datthudu Butchayya Ayyavarlangaru and Pedda veeramallu. Dattudu butchayya ayyavarlangaru Asidhara Vratasthasthulu. He performed lakhs and lakhs of ganarchanas in Tadikonda, played bellless bells, lit divities during the day and got various titles. Veerachenna Mallikarjunaswamy enshrined in Tadikonda village. Chariot utsavam was held for Swami. The descendants of this Buchcheyyagaru are the Agraharikulu of Saidepudi. Descendants of Peddaveeramallu came back to Vijayawada. Mallikarjunudu, Nageswara Rao, Subba Rao and Kameswara Rao, the sons of Pedda Veeramallayyagaru.

తాడికొండవారి మూల పురుషుడు “అఘోర శివాచార్యులు” . వీరు షట్కాల శివపూజా ధురంధరులగుటయేగాక, షడక్షరీమంతసిద్ధినందిరట. వీరు శ్రీశైలమల్లికార్జున స్వామివారి సన్నిధానమునందు ప్రణవపంచాక్షరీ మంత్రతులాభారము తూగినారు. వీరికి తామ్రశాసనములలో తాడికొండ గ్రామము అగ్రహారముగా నప్పటి అమ్మరాజ విజయాదిత్య చోళభూపాలు డిచ్చెను (క్రీ.శ. 950). పశువు - పాశము - పతి యను తత్త్యత్రయ వివేకముతో శ్రీశైలమున ఘోర తపమాచరించినతఱి పరమేశ్వరుడు ప్రసన్నమై యీ యఘోర శివాచార్యునకు వీరప్రాభవమిచ్చి, ఆచారాది షళ్ళింగ సమర్చనా విధానమును దెల్పి శ్రీశైల ప్రాక్సింహాసనాధిష్ఠితునిగా జేసెనట. తాడికొండవారి వంశవృక్షమును వీరి తర్వాత శాంత మల్లయ్య, నీలకంఠుడు, వీరమల్లయ్య, శ్రీగిరిలింగమను వారలంకరించిరి. శ్రీగిరిలింగమునకు మల్లన్న యుద్భవించెను. వీరికి శ్రీశైలపతి - అనే పాపనారాధ్యులుదయించిరి. వీరు షట్కాల శివపూజారతులు. తాడికొండ గ్రామమున పెదఘట్టుమీద శ్రీమల్లిఖార్జున లింగప్రతిష్ఠ గావించిరి. అప్పుడది శాలివాహన శకము 1061 సంవత్సరము, వీరు మహిమాన్వితులు. వీరికి శిష్య సంచారముండెడిది. ఒకప్పుడు వీరు శిష్యసంచారము చేయుచూ నొక గ్రామమునకు వచ్చిరట. వీరు శివాలయమునగాని విష్ణ్యాలయమునగాని - శివారాధన తత్పరులగు వారి గృహములందుగాని శివపూజ యొనరించి

భోజనము చేసెడి నియమముగలవారు. ఆ పల్లెయందీ సౌకర్యములేదు. ఊరికి మైలుదూరమునగల పాడుబడిన గోపాలస్వామివారి గుడియందు - అరణ్య మధ్యమున - శిష్యులు పాకవస్తువు లొసంగనేగి స్వయంపాక మొనరించుకొని యర్థరాత్రి శివపూజ గావించి భుజించి పరుండిరి. నడిరేయి గడిచిన పిమ్మట మధురాతి మధుర వేణుగానము వినవచ్చెను. గుడిలోనికి తొంగిచూడ మురళీకృష్ణుడు దర్శనమిచ్చెను. స్వామిని తాడికొండ వేంచేయమనియు వచ్చిన నిత్య ధూపదీపనైవేద్యాదులేర్పాటు చేతునని యనగా సరే యని యంగీకరించి తాడికొండ వారింటికి వచ్చెనట. ఇంటిలోని గృహిణి చల్లచేయుచుండ వెన్నహరించుట, పాలుత్రాగుట మున్నగు కొంటెపనులు గోపాలకృష్ణుడు చేయుట, ఏదో గాలి తాకిడులతో గూడిన కదలికలు గృహమందలి వారిని భయభ్రాంతులొనరించుటతో నిల్లువిడిచి పడమటివైపున గృహమేర్పరచికొని తరలిపోయిరి. కొంతకాలమునకు శ్రీశైలపతిగారు సంచారము ముగించుకొని తాడికొండ వచ్చిరి. సర్వమెఱింగి వేణుగోపాలుడు వేంచేసిన శుభవార్తను గ్రామస్థులకు తెలియజెప్పి యాలయనిర్మాణముగావించిరి. వంతులువారిగా గ్రామస్థులు నివేదించిన క్షీరమును లోపల పెట్టిపోగా మన గోపాలుడు ప్రత్యక్షముగ నారంగించెడివారట. ఒక ముసలమ్మ స్వామి ప్రత్యక్షముగా పాలు త్రాగుచుండెనా లేక యే పిల్లియైన త్రాగుచుండెనాయని రాళ్ళమధ్య నుండి తొంగిచూచెనట. త్రాగుచున్న కృష్ణమూర్తి పాలదుత్తను క్రిందపడవేసి యంతర్థానమై కలలో శ్రీశైల పతికి గన్పడి "నాయనా ఇది కలియుగము. ఇక ప్రత్యక్షముగా నైవేద్యము స్వీకరింపను. శిలపై వెలిసెదను. భక్తులు గుడికట్టించికొని నన్ను సేవించగలరు" అని యంతర్హితుడయ్యెను. తదుపరి ఆలయ నిర్మాణమై యిప్పటికిని రంగరంగ వైభోగములతో మాన్యముల సంతరించుకొని వైశాఖ పూర్ణిమకు తాడికొండలో తిరునాళ్లు గోపాలస్వామి జరుపుకొనుచున్నాడు

శ్రీశైలపతి తరువాత పెద్దమల్లనారాధ్యులు, చంద్రశేఖరుడు, త్రిపురాంతకుడు, పెదభైరవమూర్తి యనువారు క్రమముగా విలసిల్లిరి. భైరవమూర్తిగారును తపస్సంపన్నులై మహిమాన్వితులై పూసపాటి ఆనందరావుగారి వద్ద ఏనుగు బహుమానము పొంది, నగారాయున్న అగ్రహారమున్ను సంపాదించిరి. ఈ భైరవమూర్తిగారికి పర్వతాలు, కేదారలింగము, వీరభద్రయ్య జనించిరి. ఆస్తులభాగ పంపిణీ వ్యవహారమున పర్వతాలు అగ్రహారమును, కేదారలింగము కర్ణీకమును, వీరభద్రయ్య శిష్యసంచారమును పంచుకొనిరట. గ్రామాధికారిత్వము పెదభైరవమూర్తిగారినుంచి వంశపారంపర్యముగా తాడికొండవారిదై యున్నది. ఈ పర్వతాలు గారికి భైరవమూర్తి, పెద వీరమల్లు అనువారు గలిగిరి. మరల భైరవమూర్తిగారికి దత్తుడు బుచ్చయ్య అయ్యవార్లంగారు. వీరు తపోధనులు. అసిధారా వ్రతస్థులు. వీరు తాడికొండలో లక్ష - లక్షగణారాధనగావించి బొడ్డులేని గంట వాయించుట, పగటి దివిటీలు వెలిగించి యనేకబిరుదులు వహించిర తాడికొండలో వీరచెన్న మల్లికార్జునస్వామి వారిని ప్రతిష్ఠించిరి. స్వామికి రథోత్సవము జరిగెడిది. ఈ బుచ్చెయ్యగారి వంశీకులు సైదేపూడి అగ్రహారవాసులైరి. పెదవీరమల్లు వంశీకులు తిరిగి విజయవాడ వచ్చిరి. వారు వీరమల్లయ్యగారి పుత్రులు మల్లిఖార్జునుడు, నాగేశ్వరరావు, సుబ్బారావు, కామేశ్వరరావులు.